పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల్కూరీ నరసింహారెడ్డి అన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ ల పథకాల కార్యక్రమం లో భాగాగంగ పటాన్చెరువు పట్టణ జిహెచ్ఎంసి కార్యాలయంలో రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు, అనంతరం కోల్కూరీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాదిమంది నిరుపేదలు అర్హులుగా ఉన్నప్పటికి బిఅర్ఎస్ కేసీఅర్ ప్రభుత్వం విస్మరించింది అని అనేకమంది వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు పథకాలతో తెలంగాణలో కోట్లాదిమందికి లబ్ధి చేకూరే విధంగా అనేక గ్యారెంటీ పథకాలతోటి కోట్లాదిమందికి లబ్ధి చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు .కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి బిహెచ్ఎల్ బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేక పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించరని ,అలాగే రాబోయే రోజుల్లో మెదక్ నుండి శ్రీమతి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ , ప్రాతినిధ్యం వహిస్తే తప్పక ఈ రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఇందిరా గాంధీ కుటుంబం రాబోయే రోజుల్లో భావి ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే మా లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి నాయకులు పట్టణ ఉపాధ్యక్షులు మాదా శేఖర్ యువరాజ్ మోరే న్యాయవాది రంగారావు హమీద్ పాషా ఆసిఫ్ కుంచాల కిషన్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.