మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి పరీక్షల సందర్బంగా ప్రతి సంవత్సరం లాగానే విద్యార్థులకు కొమిరిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో లో ఎగ్జామ్ పాడ్, పెన్, పెన్సిల్, జియోమెట్రీ బాక్స్, స్కేల్ లను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, దాతలకు మంచిపేరు తెచ్చుకోవాలని, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రాజశేఖర్ రెడ్డి, ఏ. ఎస్ ఐ ఎండీ రహీం, గాలి నరహరి, రాం భూపాల్ రెడ్డ్, సయ్యద్ అహ్మద్, జ్యోత్స్న, వీణమ్మ, వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.