గ్రామ ప్రజలకు అండగా ఉంటా…
– రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి
– అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత
పటాన్ చెరు:
రుద్రారం గ్రామ ప్రజలకు అండగా ఉంటానని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. వేర్వేరు ఘటనల్లో అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలకు మంగళవారం తన వంతు సాయంగా ఐదువేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామానికి చెందిన ఖాజా మియా, మరో యువకుడు మురళి ఇద్దరు అనారోగ్యం తో ఇద్దరు మృతి చెందారు.సమాచారం తెలియడంతో వారి కుటుంబ సభ్యులకు నా వంతు సాయంగా ఐదు వేలు అందజేశాను. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు అవసరమైతేనే మాస్కులు ధరించి, బయటకు రావాలన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి తన వంతు సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.