జిఎస్టీ అధికారుల బెదిరింపుల నుండి కాపాడండి

Districts Telangana

అనధికారికంగా లక్షలు డిమాండ్ చేస్తున్నారు

ఖమ్మం, అక్టోబర్ 12 :

కరోనా కష్ట కాలంలో కట్టిన ఇండ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని, జీఎస్టీ కట్టలేదని ఆఫీసుకు పిలిపించి సూపరింటెండెంట్ ప్రసాద్, భరత్ లు బెదిరించారని బిల్డర్ నూకల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జీఎస్టీ బిల్ రూ. 1.40లక్షల ఫైనే ఉందని అందులో రూ. 80వేలు కడితే మొత్తం చూసుకుంటామన్నారని పేర్కొన్నారు. డబ్బులు లేక బ్రతిమిలాడుకొని రూ. 40వేలు సాధించి ఆఫీసుకు వెళ్లి ఇచ్చానని పేర్కొన్నారు. రెండు నెలల తర్వాత కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్నారని జీఎస్టీ బిల్లులు కట్టనవసరంలేదని రూ.12వేలతో ఆన్ లైన్లో రెన్యూవల్ చేయించుకోవచ్చునంటే ఆడిట్ ప్రకారం రెన్యువల్ చేయించుకున్నానని తెలిపారు.

కట్టిన బిల్డింగ్ లకు ఆడిట్ ప్రకారం ఆన్ లైన్లో జీఎస్టీ ఫీజ్ కట్టానని తెలిపారు. మరలా అదే జీఎస్టీ అధికారులు ఆఫీసుకు పిలిపించుకుని నీ ట్రాంజక్షన్ బాగుందని రూ.10లక్షలు కట్టాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్నాను అంత డబ్బులు కట్టలేనని పేర్కొన్నప్పటికీ వారి బలవంతపు ఒప్పందం ప్రకారం రూ. 6.50లక్షలు 15రోజుల్లో ఇవ్వాలన్నారని తెలిపాడు.

మరలా 3రోజులకే ఫోన్ చేసి నీకే బర్డెన్ తగ్గుతుంది రూ. 3.50లక్షలు ఒకరోజు, మిగతా రూ. 3లక్షలు మరో రోజు ఇవ్వచ్చని వత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై హైదరాబాద్ జీఎస్టీ కమీషనర్ సురేష్ కి ఫిర్యాదు చేశానని తెలిపారు. విచారణ చేసి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న జీఎస్టీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *