మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి డివిజన్ మధురా నగర్ మరియు ప్రశాంత్ హిల్స్ కాలనీ లలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వాణి ని పార్లమెంట్ లో వినిపించాలి అంటే కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిoచారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ఏరియా కమిటీ మెంబర్లు బూత్ ఇంచార్జిలు బూత్ కమిటీ సభ్యులు మరియు ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.