మనవార్తలు ,పటాన్ చెరు:
వెర్ష్యీకరణ , మానసిక ఆరోగ్య స్థితి సంక్లిష్టంగా ఉన్నందున , సమాజంలో లింగ అసమానతలను తిప్పికొట్టే , లింగ – పక్షపాతం లేని ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించే రాజకీయ , నిర్మాణ , సాంస్కృతిక , ఆరోగ్య సంరక్షణ స్థాయిలలో మార్పులను ప్రోత్సహించడం అవసరం ‘ అని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ మానసిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గేష్ నందినీ అన్నారు . ‘ మహిళల మానసిక ఆరోగ్యం ‘ అనే అంశంపై బుధవారం ఆమె ఉపన్యసించారు . P మహిళల జీవన చక్రంలో దుర్బలత్వాలను ఆమె తెలియజేస్తూ , సామాజిక , మానసిక , జీవసంబంధమైనవిగా పేర్కొన్నారు . కొన్ని సామాజిక కట్టుబాట్లు మహిళల అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయన్నారు . ప్రతి పది మంది స్త్రీలలో ఏడుగురు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని చెప్పారు . మహిళల మానసిక ఆరోగ్యం సమాజానికి అత్యంత ఆవశ్యకమని నందినీ నొక్కి చెప్పారు . నాణ్యమైన నిద్ర , తగినంత శారీరక శ్రమ , బలవర్ధక ఆహారం , స్వీయ – నమ్మకంతో జీవించడం వంటివి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయన్నారు . ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చి ఆకట్టుకున్నారు .