గీతమ్ లో ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు.

గీతమ్ లో ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని శివాజీ ఆడిటోరియంలో గురువారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకాశంతమైన, రంగు రంగుల గంటలు, నక్షత్రాలతో అలకరించిన ఆడిటోరియం పండుగ శోభను సంతరించుకుంది.స్వాగత వచనాలతో నాంది పలికిని క్రిస్మస్ సంబరాలు, శ్రావ్యమెన పాటలో ఆహూతులందరిలో ఉల్లాసాన్ని నింపాయి. నిండైన పండుగ వాతావరణంలో గీతం విద్యార్థులు ఆలపించిన మనోహరమైన పాటలు, ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శనలతో వారిలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించారు. తమకున్నది ఇతరులతో పంచుకోవడం, మంచితనాన్ని వ్యాపింప చేయడం వంటి విలువలను నొక్కిచెబుతూ విద్యార్థులు నేటివిటీ సన్నివేశాన్ని నెపుణ్యంగా ప్రదర్శించారు. మానవాళి కోసం ఏసుక్రీస్తు జననం, త్యాగాన్ని చిత్రీకరిస్తూ, ఒక ఆంగ్ల నాటకాన్ని ప్రదర్శించి, క్రిస్మస్ ప్రాముఖ్యతను చాటిచెప్పారు. క్రిస్మస్ స్ఫూర్తిని తెలిపే కథనం, చిత్రీకరణ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

క్రిస్మస్ నిజమైన అర్థం, క్రిస్మస్ చెట్టును అలంకరించే ఆభరణాల ప్రతీకాత్మత- మెరిసే నక్షత్రం, వెండి గంట, పుష్పగుచ్ఛం, కొవ్వొత్తికి శాంతా క్లాజ్ చిలిపి చేష్టలు తోడె పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. పలువురు అదృ ష్టవంతులు శాంతా క్లాజ్ నుంచి బహుమతులు అందుకున్నారు.దేవుడి గురించి తెలియజేయడానికి ఏసు ఈ ప్రపంచంలోకి వచ్చాడని, ప్రజల నిరీక్షణను, జీవితాన్ని, కాంతిని ఇవ్వడానికి వచ్చాడని పాస్టర్ పీటర్ శామ్యూల్ క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. ఎన్ఐసీ – లెఫ్ట్ ఇన్ క్రెస్టను నొక్కిచెబుతూ, ‘మీతో అంతటా జీవించగలిగేది ఒక వ్యక్తి అయితే, అది ఏసు, ఈ జీవితం ముగిసిన తరువాత, ఆయన పాపానికి మూల్యం చెల్లించాడు కాబట్టి మీతోనే ఉంటాడని, ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడు మనతోనే ఉన్నాడ’ని అర్థమన్నారు. ఐక్యతకు ప్రతీకగా నిలిచే క్రిస్మస్ కేక్ను కట్ చేయడంతో సంబరాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రతి ఒక్కరికీ కేక్, సమోసాలు, చిప్స్ వంటి వాటిని పంచి, అంతా ఒకటిగా కలిసి సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించారు.

ముగిసిన వర్క్ షాప్

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆధ్వర్యంలో బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువుల నిర్వహణ ప్రాథమిక పద్ధతులపై అవగాహన కల్పించడం కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాల గురువారం విజయవంతంగా ముగిసింది. ఈ వర్కుషాప్ లో దేశం నలుమూలల నుంచి సుమారు 450 మంది ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా సిద్ధార్థ ఇన్స్టిట్యూట్, పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, జి.పుల్లారెడ్డి కళాశాల, షాదన్ కాలేజి, భారత్ విద్యా సంస్థలు, ప్రతాల్రెడ్డి కళాశాల, గీతం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జంతు నిర్వహణ సూక్ష్మ నెపుణ్యాలపై శిక్షణ పొందారు. ఇది విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, ఆయా విద్యా సంస్థలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *