మనవార్తలు ,హైదరాబాద్:
తెలంగాణ రాష్టం లో మత్స్య సహకార సంఘాలకు వెంటనేఎన్ని కలు నిర్వహించాలని, తెలంగాణ మత్స్య కార్మికుల, మత్స్యకారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రెoకల నర్సింహ అన్నారు. ఈ నెల 20 నాడు నగరంలోని సుందరయ్య విజ్ఞానం కేంద్రoలో నిర్వహించే మత్స్య సొసైటి అధ్యక్షుల రాష్ట్ర సదస్సును జయప్రదo చేయాలని కోరుతూ రూపొందించిన పోస్టర్ ను బుధవారం రోజు మాదాపూర్ లోని దుర్గం చెరువు కట్ట మైసమ్మ వద్ద రాయదుర్గం, నల్లగండ్ల మత్స్యకారు సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీకి10 లక్షల ఆర్థిక సాయం అందించేవిధంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఫిబవ్రరి 20న జరిగే మత్స్య సొసైటీ అధ్యక్షుల రాష్ట్రసదస్సు లో తీర్మా నం చేయబోతున్నామని తెలిపారు. అఖిలభారత
మత్స్యకారులు,మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ కార్యవర్గసమావేశాలు, ఫిబవ్రరి. 20,21 తేదీలలో హైదరాబాదులో జరుగుతున్న సందర్భంగా మొదటి రోజు తెలంగాణ మత్స్య సొసైటీఅధ్యక్షుల రాష్ట్రసదస్సు జరుపుతున్నా మని, కేంద్రరాష్ట్రపభ్రుత్వా లు మత్స్యపరిశమ్ర అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికిఈ బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో తీవ్ర. అన్యా యం చేశారని, మత్స్యకారుల సమస్యలపై. ఈ నెల 20వ తేదీన జరిగే మత్స్య సొసైటీఅధ్యక్షుల రాష్ట్రసదస్సు నిర్వహిస్తున్నామని మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు పాలకవర్గసభ్యు లు పెద్దఎత్తున పాల్గొని జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు.
భారతదేశంలోనే బెస్ట్ రాష్ట్రఫెడరేషన్ అయిన కేరళ మత్స్య ఫెడరేషన్ చైర్మన్ వి.మనోహరన్, అఖిలభారత మత్స్యకారులు మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ అధ్యక్ష కార్యదర్శు లు దేబ్ శషిబర్మన్, పీ.స్టాన్లీ మరియు జాతీయ మత్యకార నాయకులు పాల్గొనబోతున్నారని తెలిపారు..పెండింగ్ లో ఉన్న ఇన్సూ రెన్స్, ఎక్స్ గ్రెసియా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని, ఎన్సీ డీసీ సమీకృత మత్స్య అభివృద్ధిపథకం అమలుకు కేంద్రరాష్ట్రపభ్రుత్వా లు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఇప్పటికైనా పప్రభ్రుత్వం పునరలోచన చేసి 5 వేల కోట్లు కేటాయించాలన్నారు, జిల్లాలో పట్టణీకరణ, పరిశమ్ర లు, ఐటీ కంపెనీలు చెరువులు, కుంటలను కబ్జాలు చేస్తున్నారని, కాలుష్యాన్ని, ,కలుషితమైన, డ్రైనేజీ నీటిని చెరువుల్లో కలుపుతున్నారని, దింతో లక్షల రూపాయల విలువ చేసేమత్స్య సంపద చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీని వల్లవృత్తి పైఅధారపడిన మత్స్యకారుల కుటుంబాలు నష్టపోతున్నాయని, ఇలాంటి కంపెనీలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయదుర్గం సోసైటిఅధ్యక్షులు, నీలం సురేందర్ కుమార్, నల్లగండ్ల సోసైటిఅధ్యక్షులు,బాల్ రాజ్, రాయదుర్గం కార్యదర్శిగోరెంకల శ్రీశైలం, కోషాదికారి అంబటి అశోక్ కుమార్,సడెల నరేందర్, మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకులు కొంగర కృష్ణ, నియోజకవర్గం నాయకులు నీరటివరుణ్ పి.నర్సింలు, దొంతి రవి తదితరులు పాల్గొన్నా రు.