పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
_సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
ప్రణాళిక బద్ధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో..
ఇండ్రేశం గ్రామ పరిధిలోని పిఎన్ఆర్ కాలనీలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ నర్సింలు, డిసిసిబి డైరెక్టర్ రాఘవేంద్ర రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివారెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, మాణిక్ రెడ్డి, దుర్గా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.