పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సినిమాటోగ్రఫీలో లైటింగ్ కీలక భూమిక పోషిస్తుందని, మానసిక స్థితి, భావోద్వేగాలను ప్రభావితం చేయగలదని, ప్రతి ఫ్రేమ్ కి లైటింగ్ ఆత్మగా పనిచేస్తుందని, కథను చెప్పడంలో సహకరిస్తుందని ప్రముఖ ఫోటోగ్రఫీ డెరైక్టర్ (డీవోపీ), వర్చువల్ సినిమాటోగ్రాఫర్ జగదీష్ బొమ్మిశెట్టి అన్నారు. ఆవుచర్ ఇండియా సహకారంతో, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ (జీఎస్ఏహెచ్ఎస్) లోని మీడియా స్టడీస్, విజువల్ కమ్యూనికేషన్స్, విభాగం ఆధ్వర్యంలో ‘సినిమాటిక్ లైటింగ్’ పై బుధవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. అందులో ముఖ్య వక్తగా పాల్గొన్న జగదీష్ చలనచిత్ర నిర్మాణంలో లైటింగ్ లోని చిక్కులను విద్యార్థులకు వివరించి చెప్పారు. ఇందులో పాల్గొన్న వారి నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు సినిమా ప్రయోజనాల కోసం బెట్టింగ్ డిజైన్ లోని సూక్ష్మ నైపుణ్యాలను ప్రదర్శించి చూపాడు. వాస్తవిక ఉదాహరణం ద్వారా, ప్రయోగాత్మక కార్యకలాపాల ద్వారా విద్యార్థులు తమ ఫిల్మ్ ప్రాజెక్టుల కోసం లైటింగ్ ఎలా వినియోగించాలో తెలుసుకున్నారు.ఈ వర్క్ షాప్, లైటింగ్ వర్క్ వివిధ అంశాలను సృజించడంతో పాటు ఇంటెలిజెంట్ బెట్టింగ్ పద్ధతులు, కలర్ గ్రేడింగ్ వంటిని వివరించారు. దృశ్యమానంగా ఆకర్షణీయమైన కథనాలను రూపొందించడంలో సమగ్ర మార్గదర్శనాన్ని అందించారు.తొలుత, జీఎస్ఏహెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యశాలను: ప్రారంభించారు. జగదీష్ తో పాటు ఆపుచర్ ఇండియా ప్రాంతీయ సేల్స్ మేనేజర్ శైను ముధులను ఆయన సత్కరించారు. ఈ వర్క్షాస్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. సుజీవన్కుమార్ సమన్వయం చేశారు. నందిని సంప్రదాయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.