ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :
బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు . కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కేఆర్ మురహరి రెడ్డిని షేక్ బాజి , కర్నూలు మైనార్టీ మోర్చా అధ్యక్షులుహావిలిన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు .ముస్లీం, క్రిస్టియన్ మైనారిటీలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలుసుకోవాలన్నారు . కేంద్ర ప్రభుత్వం హిందూ ,ముస్లీంలనే తేడా లేకుండా అందరికి సమన్యాయం చేస్తుందన్నారు .ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా మెలుగుతారని ఇతర పార్టీల నేతలు హిందూ ,ముస్లీంల మధ్య చీలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు . అనంతరం రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు షేక్ బాజీ ,జిల్లా అధ్యక్షుడు హావీలిన్ బాబు , మురహరిరెడ్డి మైనారిటీల అభివృద్ధి కోసం బీజేపీ తీసుకు వచ్చిన కార్యక్రమాల కరపత్రం విడుదల చేశారు .
ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ , పట్టణ ప్రధాన కార్యదర్శి జేట్టెప్పా ,రాష్ట్ర మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షుడు కరిముల్ల ,జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ వర్మ , జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ ,జిల్లా మైనారిటీ మౌర్చ ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా పాల్గొన్నారు