పటాన్‌చెరు
వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే బయటికి రావాలని పటాన్‌చెరులోని 113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. డ్రైనేజీ సమస్య కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని త్వరితగతిన వెళ్లిపోయల చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. స్థానికులు సైతం ఇబ్బందులు ఉంటేతమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కాలనీలలో నాలాలు పూడిక ఉన్న, డ్రైనేజీ పై మ్యాన్ హోల్స్ లేకపోయినా అక్కడ ప్రమాద హెచ్చరికలను ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
వర్షాకాలంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకో వలసిందిగా 113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ అన్నారుఇప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించమని ఆయన గుర్తు చేశారు . జిహెచ్ఎంసి అధికారులతో కలిసికొత్తగొల్ల మల్లేష్ యాదవ్ గోకుల్ నగర్ లో పర్యటించారు .