పెన్షనర్లకు కనీస వేతనం 9వేలు ఇవ్వాలి_ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి

politics Telangana

భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం ముందు

పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, వినతి పత్రం అందజేత

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు

పెన్షనర్లకు కనీస వేతనం తొమ్మిది వేలు ఇవ్వాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ అఫ్ ఈపి ఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ( ఏఐయు ఏసిఈపిఎ)కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోరాట ఎజెండా లో భాగంగా, టిఏపీ ఆర్ పిఎ జిల్లా కమిటీ మూడు రోజుల ధర్నా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు జిల్లా కమిటీ సభ్యులతో పాటు ఈపిఎఫ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం ముందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నా నిర్వహించారు అనంతరం భవిష్యనిది ప్రాంతీయ కార్యాలయం ఉప కమిషనర్ సురేంద్ర రావు కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పెన్షనర్స్ ఉద్దేసించి రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది ఈపీఎఫ్ పెన్షనర్లకు గౌరవప్రదమైన పెన్షన్ ప్రయోజనాన్ని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పెన్షనర్ల కుటుంబాలు కనీస అవసరాలు తీరక అత్యంత దయనీయ బతుకులు వెల్లదీస్తున్నారని వాపోయారు. పెన్షనర్లు చేస్తున్న విజ్ఞప్తులు, ధర్నాలు, ఉద్యమాలు, ఆందోళనలు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ల హింస వేతనం పెంచాలని లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.టిఏపీ ఆర్ పిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రామారావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ జె. వెంకటరెడ్డి,ఎం. దేవేంద్రా చారి, ఎం సత్యన్నారాయణ పాటి,సెక్రటరీస్ బి ఎల్ నాయుడు,టి ప్రభాకరరావు, సినియర్ పెన్షనర్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *