పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణం యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ నియామకమయ్యారు. ఆదివారం పటాన్ చెరు పట్టణం యాదవ సంఘం కార్యవర్గాన్ని, యాదవ సంఘం సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతవారం యాదవ సంఘం అధ్యక్షునిగా దేవయ్య యాదవ్ ను ఎన్నుకున్న సంగతి విధితమే. ఈ సందర్భంగా యాదవ సంఘం ఉపాధ్యక్షులు పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ గతవారం యాదవ సంఘం అధ్యక్షుడిని, ఇప్పుడు ఉపాధ్యక్షుడు, కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సభ్యులందరితో కలిసి యాదవ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. యాదవ సంఘం సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ల సలహాలు, సూచనలతో యాదవ సంఘం అభ్యున్నతికి కష్టపడి పని చేస్తామని తెలిపారు. తమ నియామకానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన యాదవ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్, కార్యవర్గం సభ్యులు కృష్ణ, నర్సింహ, మల్లేష్, బిక్షపతి యాదవ్, మల్లేష్ యాదవ్, నర్సింలు యాదవ్, భీమన్న యాదవ్, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ యాదవ్, జంగులు యాదవ్, నాగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
