యూపీలో రైతుల దుర్మరణం- పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట….

Districts politics Telangana

ఖమ్మం :

సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 10 నెలల నుండి ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖిం పూర్ ఖీరి జిల్లాలో జరిగిన ఒక ఘటనలో రైతులు కొంత మంది దుర్మరణం చెందటం పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట అని , జెమిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్ .హెచ్. పి. ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రునాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు . లఖింపూర్ ఖిరి జిల్లాలోని తికునియాలో ఓ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరు కానున్న సందర్భాన్ని పురస్కరించుకొని మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు రైతులు అక్కడ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న

సమయంలో మరో మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులు నల్లజెండాలు నొప్పి కారును అడ్డుకున్నప్పుడు వారిపై తన కారును దుసుకొని పోనివ్వడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారని రైతు సంఘాల ఆరోపణ , ఈ ఘటన అనంతరం జరిగిన హింసాత్మక ఈ సంఘటనలో మరో ఎనిమిది మంది మృతి చెందటం విచారకరం . మంత్రులు , ప్రభుత్వ అధికారుల వాదన , మరో వైపు రైతులు , రైతు సంఘాల వాదననలు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ రైతులు మృతి చెందడం నిజం . రైతుల ఉద్యమాన్ని పాశవికంగా అణచివేయాలని క్రూరంగా ప్రవర్తించడం కూడా నిజం. పోయినా ప్రాణాలు ఏ విధంగానూ తిరిగి రావు అని తెలిసినప్పటికీ ప్రాణాలను హరించడం పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు .

ఇటీవల ఢిల్లీలో రైతుల ఉద్యమం పై స్పందించిన సుప్రీం కోర్టు ఈ ఘటనపై కూడా స్పందించి , జుడిషియల్ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు . ఎన్నికలు సమీపిస్తున్నా తరుణంలో రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న యోగి – బిజెపి ప్రభుత్వం ఇప్పటికే హిందూ – ముస్లిం రాజకీయాన్ని ప్రారంభించిందని , మరోవైపు రైతులపై దౌష్ట్యానికి దిగిందని , మేధావులు , ప్రజాస్వామ్యవాదులు , ఉద్యమకారులు , సామాన్య ప్రజలు సైతం దీనిని గమనించి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *