పాటి నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పరిపాలన వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజలకు పారదర్శకతతో కూడిన పరిపాలన అందించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.పటాన్చెరు మండలం పాటి గ్రామంలో కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని స్థానిక సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ తో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మనకు ఏం చేసింది అన్న మూస ధోరణితో ఆలోచించకుండా మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నామన్న ఆలోచనతో ముందుకు వెళ్లాలని సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ప్రతి ఇంటా సంక్షేమం.. ఇంటి ముంగడ అభివృద్ధి అన్న లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కళ్ళ ముంగిట ప్రతి ఒక్కరికి కనిపిస్తుందని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పల్లెలు నేడు అభివృద్ధికి ప్రతికలుగా నిలుస్తున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమే కారణమన్నారు.

ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని కోరారు. ప్రతి పని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదని, సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి పైసా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో స్థలాలను కొనుగోలు చేసి, దాతల సహకారంతో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించామని గుర్తు చేశారు. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సహకారం అందించిన దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు స్వామి గౌడ్, భూపాల్ రెడ్డి, డి ఎల్ పి ఓ సతీష్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *