జాతీయస్థాయి క్రీడలకు కేంద్రంగా పటాన్‌చెరు – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

అట్టహాసంగా ప్రారంభమైన జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు

వివిధ రాష్ట్రాల నుండి హాజరైన 250 మంది బాడీ బిల్డర్స్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరులో జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జిఎంఆర్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు . ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన బాడీ బిల్డర్స్ తమ ప్రదర్శనలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రదర్శన నిర్వహించిన బాడీ బిల్డర్లకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,క్రమశిక్షణ, నిరంతర వ్యాయామం, ఆత్మవిశ్వాసం, శారీరక ధారుడ్యం ద్వారానే ఉన్నత విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. బాడీ బిల్డింగ్ అనేది కేవలం శారీరక బలం మాత్రమే కాదు, మానసిక ధైర్యం, సహనం, కష్టపడి సాధించే కళ అని పేర్కొన్నారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు ఆకర్షితులవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడలు యువతను సరైన దిశలో నడిపించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని , ప్రతి యువకుడు రోజూ వ్యాయామాన్ని తన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.పటాన్‌చెరు ప్రాంతం క్రీడా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, జాతీయస్థాయి పోటీల నిర్వహణకు అనుకూల కేంద్రంగా ఎదుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను పటాన్‌చెరులో నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గెలుపు ,ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, గూడెం మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, నిర్వాహకులు షకీల్, ఒమర్,, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *