నూతన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

అమీన్పూర్ బంధం కొమ్ములో నూతన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరా ప్రారంభం

హాజరైన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి:

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నూతన రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన జలాలు అందిస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో 11 కోట్ల 32 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన 2 మిలియన్ లీటర్ల జిఎల్ ఎస్ అర్ రిజర్వాయర్ పైపులైన్ వ్యవస్థను బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 300కు పైగా కాలనీలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్యకు ఇబ్బందులు తలెత్తకుండా ఐదు రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. నూతన కాలనీలలో సైతం మంచినీటి పైపులైన్లు వేయడంతో పాటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తావినీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. నీటి కొరతకు ప్రత్యేకగా నిలిచి అమీన్పూర్ మున్సిపాలిటీలో నేడు ప్రతి ఇంటికి మంచినీరు అందించిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పూర్తి సహాయ సహకారాలతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జిఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్రశేఖర్, ఏఈ పూర్ణేశ్వరి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *