గౌతమ్ నగర్ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలోని కాలనీలలో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ నగర్ కాలనీవాసులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. నూతన కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సందేళ్ల ఆంజనేయులు, కాలనీవాసులు పాల్గొన్నారు.