పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన జిఎంఆర్ యువసేన నాయకుడు సోహెల్ బృందం ఆధ్వర్యంలో అజ్మీర్ దర్గా వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో చదర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం దర్గాకు చదర్ ను సమర్పించారు. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అఫ్జల్, పాండు, గూడెం విక్రం రెడ్డి, మాణిక్ రెడ్డి, మేరాజ్ ఖాన్, షకీల్, ఇమ్రాన్, మసూద్, సోహైల్, ఆదిల్, ఇర్ఫాన్, వసీం, వినయ్, తదితరులు పాల్గొన్నారు.