– 578 మార్కులతో పట్టణ టాపర్ గా నిలిచిన కే నిశ్చితారెడ్డి
– 550 పైగా మార్కులు సాధించిన తొమ్మిది మంది
– 500 పైగా మార్కులు సాధించిన 47 మంది విద్యార్థులు
– శత శాతం ఉత్తీర్ణతతో చాటిన విద్యార్థులు
నిష్టాతులైన ఉపాధ్యాయులే మా విజయం , విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు
కృష్ణవేణి,మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పది ఫలితాలలో పటాన్ చెరు కృష్ణవేణి ప్రభంజనమే సృష్టించింది. గత బుధవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో పటాన్ చెరు పట్టణంలోని సీతారామపురం లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తమ అత్యుత్తమ సత్త చాటడంతోపాటు, 578 మార్కులతో కే, నిశ్చితారెడ్డి పట్టణ టాపర్ గా నిలువగా,9 మంది విద్యార్థులు 550 పైగా మార్కులు,47 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం పట్టణంలోని సీతారామపురంలోని కృష్ణవేణి పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ నాగరాజు అచ్చే ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కృష్ణవేణి, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని టాపర్ గా నిలిచిన నిశ్చితారెడ్డి తో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించడంతోపాటు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నాగరాజు, నిష్టాతులైన ఉపాధ్యాయుల బోధించడంతోనే ఈరోజు కృష్ణవేణి ప్రభంజనం సృష్టించడంతోపాటు టాపర్ గా నిలిచిందన్నారు. ఈ విజయం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు దక్కుతుందన్నారు.మేము కష్టపడడం మానేస్తామని అనుకోవద్దని, మీరు ఇంటర్ లో కూడా బాగా కష్టపడి మంచి ర్యాంకు తో విజయం సాధించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించినప్పుడే మీరు తల్లిదండ్రులకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు ఇచ్చే గొప్ప గౌరవంగా భావిస్తామన్నారు. ప్రిన్సిపల్, డైరెక్టర్ అచ్చే నాగరాజు మాట్లాడుతూ ప్రతిభవంతులైన ఉపాధ్యాయుల బోధన, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవడంతో నే ఉత్తమ ఫలితాలు సాధించి పటాన్ చెరు పట్టణంలోనే టాపర్ గా నిలిచామన్నారు. పట్టణ టాపర్ గా నిలిచిన నిశ్చితారెడ్డి తోపాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాభివందనాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,ఉపాధ్యాయురాలు,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు