పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు
విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర, జాతీయ క్రీడలకు వేదికగా పటాన్ చెరు పట్టణాన్ని తీర్చిదిదరుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న 44వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా అండర్ 14 బాలుర బాలికల కోకో క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిసాయి. ముగింపు వేడుకలకు పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అండర్ 14 బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, రంగారెడ్డి జిల్లా జట్టు రెండవ స్థానంలో, హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి అండర్ 14 బాలికల విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో మహబూబ్నగర్ రెండవ స్థానంలో, నల్లగొండ మూడవ స్థానంలో నిలిచాయి.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడునైన తనకు క్రీడారంగాన్ని ప్రోత్సహించడం సంతోషాన్ని అందిస్తుందని తెలిపారు.
క్రీడలకు కేంద్రంగా పటాన్ చెరును తీర్చిదిద్దడంలో భాగంగా ఏడు కోట్ల రూపాయలతో మైత్రి మైదానాన్ని ఆధునికరించామని గుర్తు చేశారు. ఏడాది పొడవున వివిధ అంశాల్లో క్రీడలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందిస్తే మానసిక ఆరోగ్యం, శారీరక ధారుడ్యంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. క్రీడాకారుల కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో ఉచిత వసతి, భోజనం, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా కోకో జాతీయ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన నరేష్, రిఫరీ నరేష్ లను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కోకో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, సీఐ వినాయక రెడ్డి, జిల్లా అధ్యక్షులు హరికిషన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, కోకో అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
