_ఛట్ పూజ సందర్భంగా చెరుకు పంపిణీ
మనవార్తలు ,పటాన్ చెరు:
విభిన్న సంస్కృతులకు నిలయంగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా.. ఆదివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెరుకును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని, వారి సంస్కృతి సంప్రదాయాలకు సమ ప్రాధాన్యత అందిస్తున్నామని అన్నారు. వారి కష్టసుఖాల్లో వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు. ఛట్ పూజ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక మైత్రి మైదానంలో భారీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్తర భారతీయులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, సందీప్ షా, జై కిషన్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…