రామచంద్రపురం
రామచంద్రపురం పట్టణం లో బిజెపి నాయకులు రవీంద్ర నాయక్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీకీ చెందిన మహిళలు బిజెపి పార్టీ లో చేరారు అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.బిజెపి పార్టీ ప్రవేశపెట్టే పధకాలకు, ఎస్అర్ ట్రస్టు చెసే సేవలకు ఆకర్షితులై స్వచంధంగా పార్టీ లో చేరటం చాలా సంతోషం అని అన్నారు.
సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలను పక్కకుపెట్టి దొరల తెలంగాణగా మార్చాడని విమర్శించారు రాబోయే ఎలక్షన్స్ లో గోల్కొండ కిల్ల మీద బిజెపి జెండా ఎగరడం కాయమని బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు రెండేళ్ళలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ ప్రతిష్టపర్చాల్సి న అసవరం ఉందన్నారు .ప్రతి ఒక్కరూ బూత్ స్థాయికి వెళ్ళి బిజెపి పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యంగా పటాన్ చెరు నియోజకవర్గంలో బిజెపి కార్యకర్తలందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు .ఈ కార్యక్రమంలో అనూసుయ, కుమారి, లక్ష్మి, ప్రమీల,శోభా,శహిని,జ్యోతి,రమ్య, తదితరులు పాల్గొన్నారు