పటాన్ చెరు కేంద్రంగానే పటాన్ చెరు సర్కిల్ కార్యకలాపాలు

politics Telangana

జిహెచ్ఎంసి కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దశాబ్దాల చరిత్రతో పాటు నియోజకవర్గ కేంద్రంగా కలిగిన పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి పటాన్ చెరు సర్కిల్ కార్యాలయాన్ని స్థానికంగానే కొనసాగించాలని.. లేనిపక్షంలో ప్రజలతోపాటు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.బుధవారం హైదరాబాదులోని బల్దియా ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి కమిషనర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. బల్దియా పునర్విభజన ప్రక్రియలో భాగంగా పటాన్ చెరు కేంద్రంగా ఏర్పాటుచేసిన బల్దియా సర్కిల్ కార్యాలయాన్ని ఇటీవల పరిపాలన సౌలభ్యం పేరుతో తెల్లాపూర్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం లోకి మార్చారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం పటాన్ చెరుకేంద్రంగా సేవలు అందిస్తున్నాయని సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్ కి మార్చడం ద్వారా పరిపాలనాపరంగా ఇబ్బందులతో పాటు పటాన్ చెరు, జేపీ కాలనీ, ముత్తంగి డివిజన్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.పరిపాలన పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక వసతులతో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా గతంలోనే పటాన్ చెరు పట్టణంలో సర్కిల్ కార్యాలయాన్ని నిర్మించామని తెలిపారు. నూతన సర్కిల్ ఏర్పడే వరకు సైతం పటాన్ చెరు కేంద్రంగానే పాత సర్కిల్ కార్యకలాపాలు కొనసాగాయని తెలిపారు తక్షణమే పటాన్ చెరు కేంద్రంగా సర్కిల్ కార్యకలాపాలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కమిషనర్ కర్ణన్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించడమే తమ లక్ష్యమని అతి త్వరలో పటాన్ చెరు కేంద్రంగానే సర్కిల్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *