నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యం: డాక్టర్ రామ

politics Telangana

_గీతమ్ లో ఘనంగా ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కోటి ఆరోగ్యం సాధారణ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని, జీవన నాణ్యతను (శారీరక, సామాజిక, మానసిక) ప్రభావితం చేస్తుందని ప్రముఖ దంత వెద్యుడు డాక్టర్ రాము నోముల అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో సోమవారం నిర్వహించిన ప్రపంచ నోటి ఆరోగ్యం దినోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిని పురస్కరించుకుని రుద్రారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఓరల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపుతో పాటు గీతం ఫార్మసీ విద్యార్థులతో ఆతిథ్య ఉపన్యాసం నిర్వహించారు,నోటి నుంచి వచ్చే ట్యాక్టీరియా నేరుగా లాలాజలం, రక్తం ద్వారా గుండెలోకి ప్రవేశిస్తుందని, దీనివల్ల గుండెల్లో మంట వస్తుందని, దీనిని బాక్టీరియల్ ఎండోకార్డిటిస్ అంటారని డాక్టర్ రాము పేర్కొన్నారు. నోటి పరిశుభ్రతను పాటించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని వర్ధమాన ఫార్మసిస్ట్లకు ఆయన ఉద్బోధించారు.

మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి నోరు కూడా ఒక సాధనమని, చక్కగా మాట్లాడడం, హాయిగా.. నవ్వడం, రుచి చూడటం, సరైన పోషకాహారాన్ని జీర్ణించుకోవడంపై నోటి ఆరోగ్యం ప్రభావం చూపుతుందని డాక్టర్ రాము వివరించారు. జిగ్ జాగ్గా ఉండే బ్రను పళ్లు తోమడానికి ఎంపిక చేసుకోవాలని, మూడు నుంచి ఐదు నిముషాల లోపు. పర్ణను తోనుడం ముగించాలని, త్వరత్వరగా బ్రష్ చేయకూడదని ఆయన సూచించారు. డీ-మినరలెజేషన్ ఇన్ఫెక్షన్కు : దారితీస్తుందని, దాని ఫలితంగా చిగుళ్లకు కావిటీ (గుల్ల ఏర్పడడం), తద్వారా చికాకులు ఏర్పడతాయన్నారు. ఇది రక్తస్రావం, పళ్లూడడానికి దారితీస్తుందని చెప్పారు. అధిక మద్యసేవనం, మాదకద్రవ్యాల వినియోగం, ధూమపానం దంతక్షయాన్ని పెంచుతుందని, ఇది కొన్నిరకాల నోటి క్యాన్సర్కు దారితీయడమే గాక వళ్లు ఊడిపోవడానికి కూడా దారితీస్తుందన్నారు. వాటిని మానుకోవడంతో పాటు చక్కెర పదార్థాలను పరిమితంగా భుజించాలని డాక్టర్ రాము సూచించారు.

రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని, పడుకునే ముందు లేదా భోజనం తరువాత నీరు పుక్కిలించి ఉమ్మాలని, ఆరో నీటితో కాకుండా కుళాయి ద్వారా వచ్చే మునిసిపల్ నీటితో దంతావధానం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన భోజనం చేయాలని, తీపి పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని, ఎక్కువ నీటిని తాగడంతో పాటు ఏడాదికి ఒక్కసారైనా వెద్యులచే దంత పరీక్షలు చేయించుకోవడం ద్వారా దంతక్షయాన్ని నివారించవచ్చని డాక్టర్ రాము నోముల వివరించారు.కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ టి. సుధాలన మాట్లాడుతూ, ధూమపానం, పొగాకు నమలడం అనేక ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని, అందువల్ల వాటికి దూరంగా ఉండడమే మేలని హితవు పలికారు.తొలుత, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.తినకుమార్ అతిథులను స్వాగతించి, సత్కరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సీహెన్, పవన్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దాదాపు 200 మంది చుద్రారం పాఠశాల విద్యార్థులకు చంత పరీక్షలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *