మనవార్తలు ,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఆదివారం రోజు నూతనంగా ఏర్పాటు చేసిన ట్యాక్స్ కన్సల్టెంట్ కార్యాలయాన్ని వార్డ్ మెంబర్ నిర్మల ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ట్యాక్స్ కన్సల్టెంట్ భార్గవి సుధా మాట్లాడుతూ ట్యాక్స్ రిటన్స్, జీఎస్టీ, ఇన్ కం ట్యాక్స్, అకౌంట్స్ కు సంబంధించిన అన్ని ఇక్కడ చేయబడతాయని, అందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని, వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా జీఎస్టీ కట్టాలని సూచించారు.