_చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
రైతాంగం పండించిన చివరి వరి ధాన్యం గింజ కొనుగోలు చేసేంత వరకు కొనుగోలు కేంద్రాలు పని చేస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండల ముత్తంగి, లక్డారం, పటాన్చెరు పిఎసిఎస్ పరిధిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయని అన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రతి ఒక్కరు ఎండగట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు ఉపేందర్, సువర్ణ మాణిక్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.