చిట్కుల్ గ్రామంలో నూతన చర్చి ప్రారంభం

Districts politics Telangana

పరమత సహనం భారతీయతకు మారుపేరు 
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మన వార్తలు ,పటాన్ చెరు:

పరమత సహనానికి భారతదేశం మారుపేరని, అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో కలిసిమెలిసి జీవించే ప్రజలు భారతీయులనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీ లో నూతనంగా నిర్మించిన చర్చిని స్థానిక ప్రజా ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో ప్రజలందరూ పరమత సహనం పాటిస్తూ జీవనం సాగించడం దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తోందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరూ తమ తమ పండుగలను ఆనందంగా నిర్వహించుకోవాలనీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమున్నత లక్ష్యంతో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్ణయించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మైనార్టీల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ నీలం మధు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *