కబ్జాదారుల హెచ్చరికలు

politics Telangana

_అధికారుల మౌనం పై అధికారులకు పిర్యాదు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి మండల పరిధిలో ని గంగారం పెద్ద చెరువు ను అన్నివైపుల నుండి ఆక్రమణకు గురి కావడం, ఆక్రమణ దారుల హెచ్చరిక నోటీసులపై అధికారుల మౌనంపై దర్యాప్తు చేపట్టి చెరువు రక్షణకై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్ డి ఓ, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ తొ పాటు చందానగర్ సర్కిల్ అధికారులకు పిర్యాదు చేశాడు.అభివృద్ధి పేరు మీద చుక్క నీరు లేకుండా చేసి 8 ఏండ్లు దాటిపోయిందని, ఓవైపు అభివృద్ధి పనుల తాత్సారంతో చుక్కనీరు లేకపోగా పెద్ద పెద్ద సంస్థల నిర్మాణాలు చెరువును ఆక్రమిస్తూ వాటి డ్రైనేజీని సైతం చెరువులోకి వదలుతూ ‘లేక్ బ్రీజ్’ ల పేరుతో కోట్లలో వ్యాపారాలు చేసుకుంటున్నాయని పిర్యాదు లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కళ్లు మూసుకొని చెరువుల్లోనే అనుమతులు ఇచ్చి, రెవెన్యూ వాళ్లు చెరువు అని లేఖలు రాసి ఇద్దరూ కలిసి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి చెరువులో నిర్మాణాలు జరుగుతుంటే చూస్తూ మిన్నకుండి పోయారని తెలిపారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 21, శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం అధికారుల వైఫల్యాన్ని నిరూపించడానికి ‘జనం కోసం’ సిద్ధంగా ఉందని, ఉన్నతస్థాయి అధికారి ద్వారా దర్యాప్తు జరిపించాలని, నిజాన్ని నిరూపిస్తామన్నారు. రెండుసార్లు కూల్చివేస్తే తిరిగి గుడిసె వేసి చెరువులోనే హెచ్చరిక బోర్డు పెట్టడం విచిత్రం. చెరువు కబ్జాను వెంటనే తొలగించి, గంగారం పెద్ద చెరువును పునరుద్ధరించాలని ‘జనం కోసం’ డిమాండ్ చేస్తుo దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *