శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
సంక్రాంతి పర్వదినం అనంతరం పటాన్‌చెరు కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయనున్న పాత తహసిల్దార్ కార్యాలయాన్ని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మి తో కలసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. శాశ్వత భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా ఈ భవనంలోనే కార్యాలయం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు సమకూరుస్తున్నామని తెలిపారు. శాశ్వత భవనం ఏర్పాటు కోసం అతి త్వరలో భూ కేటాయింపులు జరగనున్నాయని తెలిపారు. స్థల పరిశీలనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు. జనవరి 20వ తేదీ లోపు కార్యాలయం సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు సబ్ రిజిస్ట్రార్ సురేందర్, పంచాయతీరాజ్ డిఇ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
