రామేశ్వరం బండలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

Districts politics Telangana

అభివృద్ధిలో రోల్ మోడల్ పటాన్చెరు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు

అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో పటాన్చెరు నియోజకవర్గం రోల్ మోడల్ గా నిలుస్తోందని, శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారనీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామం లో 96 లక్షల రూపాయల తో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని కోరారు. ప్రతి పని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదని, సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. నిధులు ఉన్నా పని చేసే నాయకుడు దొరకడం చాలా అరుదనీ, అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం తపనపడే వ్యక్తి పటాన్చెరు ఎమ్మెల్యే దొరకడం ఈ ప్రాంతవాసులు అదృష్టం అని కొనియాడారు.

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో స్థలాలను కొనుగోలు చేసి, దాతల సహకారంతో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించామని గుర్తు చేశారు.. రామేశ్వరం బండ తో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. పంచాయతీ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసి వారి మన్ననలు పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, జెడ్పిటిసిలు సుప్రజ వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సర్పంచ్ ధరణి అంతి రెడ్డి ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ , ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *