పదవులు ముఖ్యం కాదు
ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
జిటిన్ కాలనీలో విద్యుత్ స్తంభాలు, తెనుగు బస్తీలో బోర్ వాటర్ సమస్యలకు పరిష్కారం
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని అధికారం ఉన్న లేకపోయినా ప్రజాసేవలో నిమగ్నమవుతామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు.మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ని చిట్కుల్ లో పలు వార్డు లలో స్థానిక కౌన్సెలర్ నీలం కవిత, సంతోష దస్తగిరి, జ్యోతి గోపాల్ గార్లతో కలిసి పర్యటించి ఎన్నికల సందర్భంగా గుర్తించిన సమస్యలను తీర్చే విషయంలో భాగంగా విద్యుత్ స్థంబాల సమస్య, బోర్ వాటర్ సమస్య, వీధి దీపాల సమస్య ను అక్కడిక్కడే పరిష్కరించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ప్రజలు ఓటేసి ఆశీర్వదించినా కొందరు కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీ కి మున్సిపల్ లో అధికారం దక్కకుండా చేశారని ఆరోపించారు. అయిన ఈ కుట్రలకు బెదిరేది లేదని ఎవరెన్ని కుట్రలు చేసినా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. ప్రజా సేవకు పదవులే అక్కర్లేదని తనను నమ్ముకున్న వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మన ప్రాంతానికి ప్రత్యేక నిధులు తీసుకుని వచ్చి ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు వెంకటేష్, మురళి, విఠల్, శ్రీను, విష్ణు, అంజి రెడ్డి,స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
