బాసర త్రిబుల విద్యార్థినికి 50 వేల ఆర్థిక సాయం….నీలం మధు ముదిరాజ్

Districts Hyderabad Telangana

సంగారెడ్డి

బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన నిరుపేద కుటుంబానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 50 వేల ఆర్థిక సాయం అందించారు . పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్ర నగర్ కాలనీకి చెందిన విద్యార్థిని రాహీ కుమారి త్రిబుల్ ఐటీ 434 ర్యాంకు సాధించింది. విద్యార్థిని చదువు కోసం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత చాటుకున్నారు.

రోజు కూలీగా పని చేస్తున్న గోవింద్ ఝా, సరిత ఝా దంపతుల కూతురు రాహీ కుమారి త్రిబుల్ ఐటీలో మంచి ర్యాంకు సాధించింది. శుక్రవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్పంచ్ నీలం మధు నివాసంలో విద్యార్థిని రాహీ కుమారి తన తల్లిదండ్రులతో వచ్చి కలిసింది. బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించినందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రాహీ కుమారుని అభినందించి, శాలువాతో సత్కరించారు. ఆమె చదువు కోసం ల్యాప్ టాప్ కావాలని కోరగా సర్పంచ్ నీలం మధు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ బాసర ఐఐఐటిలో సీటు సాధించడం చాలా గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు గ్యారాల మల్లేష్ ముదిరాజ్, మాంబాపూర్ ఉపసర్పంచ్ తలారి దయానంద్, ఆనంతారం మాజీ ఉప సర్పంచ్ గోపాల్, బొంతపల్లి పంచాయతీ వార్డు సభ్యులు వినోద్, అన్నారం వార్డు సభ్యులు దర్గా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *