నవభారత్ నిర్మాణ్ యువ సేన చేస్తున్నసేవలు అభినందనీయం : వక్తలు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సమాజంలో శాంతిని నెలకొల్పి మనుషుల మధ్య కుల,మత,వర్ణ,వర్గలకు అతీతంగా శాంతి సౌభ్రతృత్వంను నెలకొల్పుతున్న నవభారత్ నిర్మాణ చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు అన్నారు .సంగారెడ్డి జిల్లా కేంద్రం ఇస్లామిక్ సెంటర్‌లో సద్భావన ఫోరం ఆధ్వర్యంలో విద్య,వైద్య,ఆరోగ్య, సామాజిక సేవా రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ,సంస్థలకు అవార్డులను అందించారు .సమాజంలో శాంతిని నెలకొల్పే సంస్థలు ,వ్యక్తుల గుర్తించి అవార్డులు ,ప్రసంశ పత్రాలతో సత్కరిస్తుందని సంస్థ నిర్వహకులు మొయిజొద్దిన్ తెలిపారు .సమాజ సేవ చేస్తూ గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను చైతన్య పరిచే సమాజహితమైనకార్యక్రమాలు నిర్వహిస్తున్న నవ భారత్ నిర్మాణ్ యువ సేన తరపున తనకు అవార్డు లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని మెట్టు శ్రీధర్ అన్నారు . తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి అవార్డుతో సత్కరించడం తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు .తాను సైతం సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్ప బలమే తనను సమాజసేవ వైపు నడిపించిందన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ విజయ లక్ష్మీ,హెడ్ మాస్టర్ అశోక్ గొల్లపల్లి, ద్రాక్షయణి సంస్థ అధ్యక్షులు సాధిక్ అహ్మద్ ,వెంకటేశ్వర్లు, యువజన సంఘాల సమితి కూన వేణు రాచర్ల ,భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *