గీతమ్ లో ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో గురువారం ‘జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, హెదరాబాద్ లోని భారత గణాంక సంస్థకు చెందిన డాక్టర్ జీఎస్ఆర్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కటింగ్ స్టాక్ ‘సమస్య’ను ఆయన విశదీకరించారు. ఇది అనేక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుందన్నారు. విద్యార్థులను అత్యంత ఆకర్షణీయమైన, కీలకమైన పాఠ్యాంశం వైపు ఆకర్షించడానికి ఉద్దేశించిన ‘సరైన నిర్ణయాలు తీసుకోవడానికి గణితశాస్త్ర ప్రోగ్రామింగ్’ గురించి డాక్టర్ మూర్తి వివరించారు.

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రాజా, సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు పాల్గొన్నారు. గీతం గణాంక ఆచార్యులు డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, డాక్టర్ కె. అనిల్కుమార్, శివ, అతిథిలతో కూడిన విద్యార్థి బృందం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

మహలనోబిస్ గురించి:

భారతీయ శాస్త్రవేత్త, గణాంకవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ స్వేచ్ఛా భారతదేశం మొదటి ప్రణాళికా సంఘంలో పనిచేశారు. ఒక పెద్ద నమూనా సర్వేను రూపొందించడంలో, మహాలనోబిస్ దూరాన్ని గుర్తించడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ని స్థాపించి ఆంత్రోపోమెట్రీ రంగానికి తనవంతు సహకారం అందించారు. గణాంక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు, బహుమతులను _అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *