– అమూర్త పత్ర సమర్పణకు తుది గడువు : ఈనెల 20
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 8-9న ‘ గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్ ‘ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ ఎం . కిరణ్మయిరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈ సదస్సు ప్రధానంగా పునరుత్పాదక ఇంధన వనరుల సమర్థ వినియోగం , వ్యర్థాల పునర్వినియోగం , శక్తిని సముచితంగా ఉపయోగించడం , ఆరోగ్యం – భద్రతా సమస్యలు , పర్యావరణ నివారణ , క్యాప్టివ్ క్లీన్ ఎనర్జీపై దృష్టి సారించనున్నట్టు ఆమె పేర్కొన్నారు . ఈ సదస్సులో పాల్గొనేవారు వ్యర్థ నిర్వహణ , పునర్వినియోగం , నీటి నుంచి శక్తిని ఉత్పత్తి చేయడం , నీటి శుద్దీకరణ , విద్యుత్ వాహనాలు , పర్యావరణ నివారణ , పునరుత్పాదక ఇంధన వనరులు , పర్యావరణ వ్యవస్థ సేవలు మొదలైన వాటిపై పరిశోధక వ్యాసాలను ప్రచురించవచ్చని డాక్టర్ కిరణ్మయి తెలియజేశారు . అమూర్త ( అబాక్ట్ ) పత్ర సమర్పణకు ఈనెల 20 తుది గడువని , ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తిగల వారు తమ పేర్లను ఈనెలాఖరులోగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు . రిజిస్ట్రేషన్ ఫీజు , ఇతర వివరాల కోసం 99660 26489 ను సంప్రదించాలని , లేదా gtsf2022@gitam.in కు ఈ – మెయిల్ చేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…