జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ను కలిసి వివరించిన నడిగడ్డతాండా వాసులు

Hyderabad politics Telangana

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

ఢిల్లీలో జరిగిన నడిగడ్డ తాండ సీఆర్పీఎఫ్ సమస్యపై జాతీయ వెనుకబడిన వర్గాల బీసీ కమిషన్ సభ్యులు ఆచారి ఢిల్లీలో సీఆర్పీఎఫ్ హైకమాండ్ ఐజీ మరియు డీఐజీ మరియు కస్టోడియం ల్యాండ్ ఆఫీసర్లు మరియు రెవిన్యూ అధికారులు కమిషన్ ముందు హాజరు అయ్యారు. ఆచారి మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి మెట్రోరైలు ప్రాజెక్టు హుడా వారు అక్కడ భూకబ్జాలు చేసి భవనాలు కట్టుకున్న ముందునుంచే బంజారాలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు నివాసం ఉంటున్నారు. ఆ పేద ప్రజలపై దయవుంచి నడిగడ్డ తండా సుభాష్ చంద్రబోస్ ల ను మినహాయించి మిగతా భూమిని సీఆర్పీఎఫ్ వాళ్ళకు సర్వే చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

అలాగే సీఆర్పీఎఫ్ అధికారులకు కూడా తాండా సుభాష్ చంద్రబోస్ నగర్ లను వదిలి ఖాళీ స్థలాన్ని తీసుకోవాలని కోరడం జరిగింది. వారు కూడా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించారు. కానీ రెండు బస్తీలు మినహాయించి ఖాళీ స్థలాన్ని సర్వే చేసి వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది .అలాగే కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి ని కూడా కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో నేను వివరాలు తెప్పించి అవసరమైతే కేంద్ర మంత్రివర్యులు సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా తో మాట్లాడి మి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు .

మన సమస్యను తీర్చడానికి ఢిల్లీ దాకా తీసుకెళ్లి అనునిత్యం పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ కు నడిగడ్డ తాండప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, సీనియర్ నాయకులు ఇస్లావత్ దశరత్ నాయక్ ఏఐబీఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి.మాట్లాడుతూ రెండు బస్తిల సమస్య సమగ్రము గా తెలుపుతూ,మా సమస్యను పరిష్కారం చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *