_వ్యాపార మిత్ర బిజినెస్ లోన్ స్కీమ్ ప్రారంభం
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
ఇన్నాళ్లు గోల్డ్ లోన్ కె ప్రాధాన్యత నిచ్చిన ముతూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సంస్థ తక్కువ వడ్డీరేట్లతో బిజినెస్ లోన్ లు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టింది.చిరు మధ్యతరగతి వ్యాపారస్తులు వ్యాపార మిత్ర బిజినెస్ లోన్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని ముతూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సౌత్ అండ్ ఈస్ట్ జోన్ బిజినెస్ హెడ్ కె. వినోద్ కుమార్ తెలిపారు. చందానగర్ లోని ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపారమిత్ర స్కీమును బుధవారం రోజు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాంచ్ ఆఫీస్ కు కిలోమీటర్ దూరం పరిధిలో ఉన్న చిరు, మధ్య తరగతి వ్యాపారస్తులకు 25 వేల నుండి 5 లక్షల వరకు వ్యాపార మిత్ర లోన్స్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, వారు ఆర్థికంగా ఎదగాలని కోరారు. వ్యాపారాన్ని విస్తరించడం కోసం ఇప్పటివరకు వినియోగదారుల సమయాన్ని వృధా చేయకుండా తక్కువ సమయంలోనే మా సిబ్బంది తమ సేవలు అందిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని ఆయన కోరారు. ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉన్న వారు, స్థిర నివాసం ఏర్పరచుకున్న వారందరూ ఈ స్కీంకు అర్హులని, దీన్ని అందరూ సద్విని చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ ఎస్.ఎం. రాజ్ కుమార్. మార్కెటింగ్ మేనేజర్ కృష్ణ పవన్, సిబ్బంది పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…