పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుండాలని బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్, జంట నగరాల కాపు సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మిరియాల రాఘవరావులు అన్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం, ఇస్నాపూర్ వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు సుబ్బారావు, వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఆత్మీయ కలయిక సమావేశం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ… మున్నూరు కాపుల అభివృద్ది కోసం చర్చించారు. వారికి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. సుమారు రెండు వందల మందికి గాలి అనిల్ కుమార్ సొంత నిధులు రూ.10 లక్షలతో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుటకు నిర్ణయించారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త గోవింద రావు, వ్యాపారవేత్త సోము సత్యనారాయణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీకర్, ఇస్నాపూర్ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, సంగారెడ్డి జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది యాదగిరి, సీనియర్ కాపు నాయకులు, ఇస్నాపూర్ కాపు సంఘం ఫౌండర్ తిక్కిరెడ్డి విష్ణుమూర్తి, కాపు నాయకులు సత్తి హనుమాన్ అప్పారావు, పటాన్ చెరు, అశోక్ నగర్, చందానగర్, అమీన్ పూర్, గోపనపల్లి, బీడీఎల్ కాపు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు.