పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణంలో ఈనెల 23న జరిగే జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్ నియోజకవర్గంలో పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్లు ఉన్నాయని, తెల్లాపూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, అమీన్పూర్, బొల్లారం, జిన్నారం, గడ్డ పోతారం, గుమ్మడిదల మున్సిపల్ లో దాదాపు 1000 మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపల్ లో కార్మికులు వందలాదిమంది ఉన్నారన్నారు. జిన్నారం మున్సిపల్ లో గత మూడు నెలలుగా వేత నాలు చెల్లించడం ప్రస్తుత వర్షాకాలంలో తెల్లాపూర్ మున్సిపల్ లో 60 మంది మున్సిపల్ కార్మికులకు నేటికీ రెయిన్ కోర్టులు, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి.మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీస వేతనం కింద 26వేల రూపాయలు చెల్లించాలని సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. పటాన్ చెరు లో జరిగే మున్సిపల్ కార్మికుల ఐదవ మహాసభలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. జిల్లాలోని మున్సిపల్ వర్కర్లందరూ ఈనెల 23న పటాన్ చెరు పట్టణంలో జరిగే భారీ ర్యాలీ, మహాసభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జయరాం, పోచయ్య, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.