_బీద బలహీన వర్గాలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా ?
మనవార్తలు ,అమీన్పూర్ :
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, అమీన్పూర్ తాసిల్దార్ విజయకుమార్ వ్యవహార శైలితో నిరుపేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తూ, నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన విమర్శించారు.తహసిల్దార్ విజయకుమార్ వ్యవహార శైలి నిరసిస్తూ మంగళవారం ఉదయం అమీన్పూర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పాలకవర్గంతో కలిసి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన ఒక నిరుపేద కుటుంబం గత పది సంవత్సరాలుగా 100 గజాల స్థలంలో చిన్న గది నిర్మించుకొని నివాసము ఉంటుందని, నిరుపేదల కోసం ప్రభుత్వం కల్పించిన 58 59 జీవో కింద రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రతిఏటా ప్రభుత్వానికి పన్ను చెల్లింపులు సైతం చేస్తున్నారు అని తెలిపారు.ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం తమ గది చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకుంటే, ఎమ్మార్వో విజయ్ కుమార్ దౌర్జన్యంగా వ్యవహరించి తమ రెవెన్యూ సిబ్బందితో కలిసి కూల్చివేయడంతో పాటు అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులను దూషించడం జరిగిందని ఆరోపించారు.
ఈ అంశంపై తాను తాసిల్దారుని ప్రశ్నించగా, మంగళవారం ఉదయం కార్యాలయం వద్దకు రమ్మని చెప్పి, అందుబాటులో ఉండకపోవడం ఆయన వ్యవహార శైలికి అర్థం పడుతుందన్నారు.ఎమ్మార్వో వ్యవహార శైలి నిరసిస్తూ సుమారు నాలుగు గంటల పాటు నిరసన చేపట్టినా కూడా ఎమ్మార్వో విజయకుమార్ స్పందించకపోవడం దారుణం అన్నారు. గత మూడు సంవత్సరాలుగా అమీన్పూర్ మున్సిపాలిటీ తో పాటు మండల పరిధిలో ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న చర్యలు తీసుకోకుండా రెవెన్యూ వ్యవస్థ నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు.మునిసిపల్ ఛైర్మెన్ తో పాటు కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.