Telangana

సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో విజేతగా నిల్చిన ముకుందాపురం క్రీడాకారులు

_క్రీడాకారులను అభినందించిన పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్టేల్ లెవెల్ ఛాంపియన్ షిప్ వాలీబాల్ పోటీల్లో నల్గొండ టీం విజేతగా నిలిచింది. నల్గొండ జిల్లా టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం క్రీడాకారులు కావడం విశేషం . క్రీడాకారులకు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం పెట్టింది పేరని పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ ,కబడ్డీ, మారథాన్ ,వాలీబాల్ ఒక్కటేమిటి అన్నింటా ముకుందాపురం విద్యార్థులు ముందుంటారని తెలిపారు. తాను 1997లో శ్రీలంక క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యానని గుర్తు చేశారు. అప్పట్లో క్రీడల్లో ముకుందాపురంకు గుర్తింపు తెచ్చానని తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన వినోద్ వంగల ధనుష్ కూడా మారథాన్ లో దేశ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు. ఈ ఏడాది సీఎం కప్ 2023లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ విభాగంలో నల్గొండ జట్టు బాలికలు వరంగల్ జిల్లాపై గెలిచి ప్రథమ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు.

నల్గొండ జిల్లా వాలీబాల్ టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం వాసులు కావడం సంతోషంగా ఉందన్నారు. రాంకావ్య, ఎస్‌కే నాగురా,రామ్ రమ్య, ఎస్‌కె ఫారినా ,టి రేణుకలు ముకుందాపురం గ్రామస్థులు కాగా మరో విదార్థి కె లావణ్య ముకుందాపురం జిల్లాపరిషత్ పాఠశాలలో చదివడం అభినందనీయమన్నారు .సీఎం కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ విభాగంలో నల్గొండ జట్టు విజయం సాధించడం పట్ల పటాన్చెరువు సీఐ వేణుగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు.నల్గొండ జట్టులోని క్రీడాకారినుల్లో ఐదుగురు తన స్వంత గ్రామం ముకుందపురం వారు కావడం గర్వంగా ఉందన్నారు . ఈ సందర్బంగా అయన క్రీడాకారులకు పదివేల నగదు ప్రొత్సహంతో పాటు అభినందనలు తెలిపారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

8 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

8 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

8 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

8 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

8 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago