_క్రీడాకారులను అభినందించిన పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్టేల్ లెవెల్ ఛాంపియన్ షిప్ వాలీబాల్ పోటీల్లో నల్గొండ టీం విజేతగా నిలిచింది. నల్గొండ జిల్లా టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం క్రీడాకారులు కావడం విశేషం . క్రీడాకారులకు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం పెట్టింది పేరని పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ ,కబడ్డీ, మారథాన్ ,వాలీబాల్ ఒక్కటేమిటి అన్నింటా ముకుందాపురం విద్యార్థులు ముందుంటారని తెలిపారు. తాను 1997లో శ్రీలంక క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యానని గుర్తు చేశారు. అప్పట్లో క్రీడల్లో ముకుందాపురంకు గుర్తింపు తెచ్చానని తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన వినోద్ వంగల ధనుష్ కూడా మారథాన్ లో దేశ స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు. ఈ ఏడాది సీఎం కప్ 2023లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ విభాగంలో నల్గొండ జట్టు బాలికలు వరంగల్ జిల్లాపై గెలిచి ప్రథమ స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు.
నల్గొండ జిల్లా వాలీబాల్ టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం వాసులు కావడం సంతోషంగా ఉందన్నారు. రాంకావ్య, ఎస్‌కే నాగురా,రామ్ రమ్య, ఎస్‌కె ఫారినా ,టి రేణుకలు ముకుందాపురం గ్రామస్థులు కాగా మరో విదార్థి కె లావణ్య ముకుందాపురం జిల్లాపరిషత్ పాఠశాలలో చదివడం అభినందనీయమన్నారు .సీఎం కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ విభాగంలో నల్గొండ జట్టు విజయం సాధించడం పట్ల పటాన్చెరువు సీఐ వేణుగోపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు.నల్గొండ జట్టులోని క్రీడాకారినుల్లో ఐదుగురు తన స్వంత గ్రామం ముకుందపురం వారు కావడం గర్వంగా ఉందన్నారు . ఈ సందర్బంగా అయన క్రీడాకారులకు పదివేల నగదు ప్రొత్సహంతో పాటు అభినందనలు తెలిపారు.