మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి ఎన్నికల మేనిఫెస్టో లో మరియు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శివ ముదిరాజ్ చేతుల మీదుగా ప్రారంభిoచారు. హైదరాబాదులోని బిసి భవన్లో ఏర్పాటును సమావేశంలో శివ ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణలో 60 లక్షల జనాభా కలిగిన కానీ , ముదిరాజ్ కులం మాత్రం విద్య, ఉద్యోగాలలో వెనుకబడింది. ముదిరాజులకు రిజర్వేషన్ అమలులో జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న ముదిరాజ్ కులం అంత కాంగ్రెస్ వైపు నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. అంతే కాకుండా నూతనంగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వంలో ముదిరాజు లకు నామినేటెడ్ పదవులను , చైర్మన్ పదవులను ఇవ్వాలని, అలాగే తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతినీ, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్న ముదిరాజులు అందరూ కూడా పోస్ట్ కార్డ్ ద్వారా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని, అలాగే డిమాండ్ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి ఉదయ్ ముదిరాజ్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మం ముదిరాజ్, జాయింట్ సెక్రటరీ సురేష్ ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు సాయి కిరణ్ ముదిరాజ్ , నల్గొండ జిల్లా అధ్యక్షులు నీలం సైదులు ముదిరాజ్, మునుగోడు నియోజక వర్గ ఇంచార్జీ పూల వెంకటేష్ ముదిరాజ్ సంగపు గిరి ముదిరాజ్ ప్రేమలత ముదిరాజ్, సాయి కిరణ్ ముదిరాజ్, భాను ముదిరాజ్, గౌతమ్ ముదిరాజ్, ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర మహిళా నాయకురాలు రమాదేవి ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.