మనవార్తలు ,జిన్నారం:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపిటిసి వెంకటేశం గౌడ్ పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించే స్కూల్ యూనిఫాంలను అందించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా ప్రభుత్వం నుండి వచ్చిన స్కూల్ యూనిఫామ్ లను అందజేశామని అన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న గ్రామ సర్పంచ్,ఎంపీటీసీలు వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ,వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్ ,గోకర్ శ్రీధర్ గౌడ్ ,ఏర్పుల లింగం,ఎస్ఎంసి చైర్మన్ ఏర్పుల భాస్కర్,నిఖిల్ గౌడ్, యూత్ అధ్యక్షుడు ప్రేమ్,శేఖర్,రాము,సంజీవ తదితరులు పాల్గొన్నారు.