* అంగడిపేట లో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
* పండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అంగడిపేట గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు . ఆలయ ఇన్చార్జ్ చోట్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు మధును సాదరంగా ఆహ్వానించి, వేద మంత్రోచరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నీలం మధును శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ తనపై ఉండాలని భగవంతుడి దయవల్ల రాష్ట్రం లోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ,స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జ్ శ్రీనివాస్, కమిటీ సభ్యులతో పాటు ఎంపీపీ లావణ్య, తనయుడు సాయి, చాపల విశ్వనాథం, గుమ్మడిదల జగన్ తదితరులు పాల్గొన్నారు .