పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఈనెల 24వ తేదీన నిర్వహించ నారీ సాహిత్య భేరి అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం కార్యక్రమానికి శేరిలింగంపల్లి కి చెందిన మోటూరి జయశ్రీ ప్రత్యేక అతిథిగా ఎంపికయ్యారు . తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగ వరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వా హకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రకటన విడుదల చేశారు. దాదాపు 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే నారీ సాహిత్య భేరి సాహిత్య సమ్మేళనంలో భారత్ తో పాటు విశ్వ వ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచ యిత్రులు పాల్గొననున్నారు.ఇందులో మోటూరి జయశ్రీ తమ కవిత్వాన్ని వినిపించనున్నారు. అరుదైన గౌరవం, అవకాశం అందించిన తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగ వరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వా హకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా అత్యంత ప్రతిష్టాత్మక తానా ప్రపంచ సాహిత్య వేదిక లో పాల్గొనేందుకు ప్రతిపాదించిన తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు కు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సాహితీ వేత్తలు, సాహితీ సంస్థల ప్రతినిధులు శుభాకాంక్షలుతెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…