మాతృ భాషా సాహిత్య పురస్కారం అందుకున్న జర్నలిస్టు మోటూరి నారాయణరావు

Hyderabad politics Telangana

మనవార్తలు ,హైదరాబాద్

తెలుగు వెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి, పాత్రికేయులు మోటూరి నారాయణరావు మాతృభాషా సాహిత్య పురస్కారం అందుకున్నారు. నగరంలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్ సెంటర్ వేదికగా తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగు కూటమి, తెలంగాణ రచయితల సంఘం,గోల్కొండ సాహితీ కళా సమితి ,లక్ష్య సాధన ఫౌండేషన్ తదితర తెలుగు సాహితీ సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు నందిని సిధారెడ్డి , నాళేశ్వరం శంకరం, కోదండరామయ్య బడేసాబ్ దాసోజు పద్మావతి తదితర సాహిత్య దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు పీఆర్ ఎస్ ఎన్ మూర్తి గారి తరపున మాతృభాష పురస్కారాన్ని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు అందుకున్నారు.

ఈ సాహిత్య కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహిత్య వేదిక కుటుంబ సభ్యులందరితో కలిసి ఆ వేదికపై మోటూరి నారాయణరావు కూడా తాను రచించిన కవితలను చదివి సాహితీ వేత్తలను, ఆహుతులను అబ్బుర పరిచారు. తెలుగు వెలుగు సాహిత్య వేదిక సాహిత్య పెద్దలు, మిత్ర బృందం, సాహితీ ప్రియులు,ప్రముఖులు గంటా మనోహర్ రెడ్డి , లంకా వెంకటస్వామి , మేడిశెట్టి యోగేశ్వరరావు పోలయ్య కవి రామకృష్ణ వేమన శ్రీ సాయిచరణ్ , డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి , పోచం సుజాత మొండ్రెటి సత్య తదితర సాహితి దిగ్గజాలకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో సాహితీ ప్రముఖులు, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *