మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
హైదరాబాద్ నగరంలో ది కేఫ్ నీలోఫర్ యొక్క దార్శనిక అధ్యక్షులు ఎ బాబు రావు ప్రారంభించిన ఈ కొత్త కేంద్రం, వాణిజ్య వినియోగదారులకు పొదుపు, భద్రత, స్థిరత్వానికి భరోసా ఇచ్చేలా స్మార్ట్ గ్యాస్ ఆవిష్కరణలను అందించనుందనీ తెలిపారు. భారతదేశంలో వాణిజ్య, పారిశ్రామిక గ్యాస్ వ్యవస్థలు, పరిష్కారమార్గాలను అందించటంలో పేరుగడించినపూణే గ్యాస్, తెలంగాణలో మొట్టమొదటి అంకితమైన వాణిజ్య, పారిశ్రామిక, సహజ వాయువు వ్యవస్థలతో పరిష్కార మార్గాలను అందించే పూణే గ్యాస్ అనుభవ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించినట్లు ప్రకటించడానికి గర్వపడుతోందనీ పేర్కొన్నారు. భారతదేశంలో అతిపెద్ద టీ కేఫ్, ఆతిధ్యరంగంలో ఖ్యాతిగడించిన సంస్థ కేఫ్ నీలోఫర్ చైర్మన్ ఎ బాబు రావు సమక్షంలో సోమవారం రోజు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవంలో పూణే గ్యాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెసల్ సంపత్, డైరెక్టర్ ఆఫ్ సేల్స్ భవెన్ ఉదేశి, ఇగ్నైట్ ఎల్ పి జీ మరియు ఫ్రాంచైజ్ ఓనర్ పూణే గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ సి ఈ ఓ వినయ్ ప్రకాష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూణే గ్యాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెసల్ సంపత్ మాట్లాడుతూ పూణే గ్యాస్ ఎల్లప్పుడూ ఇంధనాల అన్వేషణల ద్వారా వాణిజ్యాలను మార్చటంలో విశ్వసనీయతను కలిగి ఉందని, తమ ఎక్సపీరియెన్స్ సెంటర్ల ద్వారా మేధో అంతరాన్ని తగ్గించి ప్రతి వాణిజ్య సంస్థ తమ సంస్థ సేవలను సులువుగా పొందే వెసలుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. ఇంధన ఖర్చులు పెరగటం, స్థిరత్వ ఆదేశాలు కఠినంగా మారుతుండటం వల్ల పరిశ్రమలు స్మార్ట్, క్లీనర్ ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం చాలా ముఖ్యమని, తమ సంస్థ ఆ ప్రత్యామాయ మార్గాలనే అందిస్తోందని అన్నారు.
ఇంతటి విశేషాలు కలిగిన తొలి సెంటర్ ను తెలంగాణాలో ప్రారంభించడం తమకెంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. మినర్వా కాఫీ షాప్, బ్రాడ్వేఫుడ్ స్టోర్స్ వంటి మేటి సంస్థలు పూణే గ్యాస్ సిస్టమ్స్ సేవల ద్వారా లబ్దిపొందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ ఎక్సపీరియెన్స్ సెంటర్ చిన్నపాటి క్లౌడ్ కిచెన్ల నుండి భారీస్థాయీ ఉత్పత్తిదారుల వరకూ ప్రతి వాణిజ్యానికి లాభాన్ని స్థిరత్వాన్ని అందించగలిగే ఇంధన సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడానికి దోహదపడుతుందన్నారు.